టాప్-9 యూనివర్సిటీలు ఇవే…

image

మంచి కంపెనీలో.. ఆరంకెల జీతం ఉన్న ఉద్యోగం రావాలంటే చిన్న విషయం కాదు.

ప్రపంచంలోనే అగ్రశ్రేణి యూనివర్సిటీలలో చదివితేనే అది సాధ్యం అవుతుంది. ప్రస్తుతం కొత్త
విద్యా సంవత్సరం ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అత్యధికంగా సీఈవోలను, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లను, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లను తయారుచేసిన బ్రిటిష్ యూనివర్సిటీల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

ఇవి బ్రిటన్‌లో టాప్-9 యూనివర్సిటీలు. అవేంటో ఓసారి చూద్దామా..

1) లండన్ బిజినెస్ స్కూల్
(London Business School):
ప్రపంచంలో వివిధ సంస్థలలో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్నవారిలో 5 శాతం మంది ఈ వర్సిటీ విద్యార్థులే. ఇక్కడి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ప్రతి 20 మందిలో ఒకరు ఏదో ఒక కంపెనీని లీడ్ చేసే స్థాయిలో నిలిచారంటే ఈ స్కూల్ గొప్పతనం తెలుస్తోంది. అందుకే ఇది అగ్రస్థానంలో దూసుకెళ్తోంది.

2) యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (University of Cambridge):
అత్యంత ప్రతిష్ఠాత్మక, పురాతన వర్సిటీలలో ఇదొకటి. ఉన్నత స్థాయిలో ఉన్న వారిలో 3.9 శాతం మంది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యార్థులున్నారు.

3) బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ (University of Birmingham):
కామర్స్ అధ్యాపకులను నియమించిన మొదటి వర్సిటీ ఇది. బ్రిటన్‌లోనే పురాతనమైన బిజినెస్ స్కూల్‌గా పేరొందింది. వివిధ సంస్థల్లో మెరుగైన స్థానంలో ఉన్న వారిలో 3.2 శాతం మంది ఈ యూనివర్సిటీ విద్యార్థులే.

4) స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీ
(Stratklaid University):
200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వర్సిటీ గ్లాస్కోలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాలలో ఉన్న 3.1 శాతం మంది ఉద్యోగులు ఈ వర్సిటీకి చెందినవారే. దాదాపు 21వేల మంది విద్యార్థులున్నారు

.5) లీడ్స్ బెకెట్ యూనివర్సిటీ
(Leeds Beckett University):
లీడ్స్ మెట్రోపోలిటన్ యూనివర్సిటీగా ఉన్న దీని పేరును 2014లో లీడ్స్ బెకెట్‌గా మార్చారు. యూకేలో అతి పెద్ద యూనివర్సిటీల్లో 20వ స్థానంలో ఉంది. దీనిలో 26 వేల మంది విద్యార్థులుంటారు. ఈ వర్సిటీ విద్యార్థులలో 3.1 శాతం మంది వివిధ కంపెనీల్లో టాప్ ప్లేస్‌లో ఉన్నారు.

6) యూనివర్సిటీ ఆఫ్ లండన్ (University of London):

కింగ్స్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజిలతో కలిపి దీనిలో దాదాపు 18 కాలేజీలున్నాయి. 1,40,000 మంది విద్యార్థులతో అతిపెద్ద వర్సిటీగా పేరు పొందింది. పెద్ద సంస్థలో ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగుల్లో 2.9 శాతం మంది ఈ వర్సిటీకి చెందినవారు.7) రాయల్ హాలోవే (Royal Holloway):ఉన్నత స్థానాలలో ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 2.6 శాతం మంది రాయల్ హాలోవే విద్యార్థులే. ఈ క్యాంపస్‌ను 1879లో విక్టోరియన్ వ్యాపారవేత్త థామస్ హాలోవే స్థాపించారు. మొదట్లో ఇది మహిళా కళాశాల మాత్రమే. తర్వాతి కాలంలో 1945 నుంచి పురుషులకు కూడా ప్రవేశం కల్పించారు.

8) లీసెస్టర్ యూనివర్సిటీ
(University of Leicester):

టాప్ స్థానాల్లో ఉన్న ఉద్యోగుల్లో 2.6 శాతం మంది ఈ వర్సిటీవాళ్లే. దీనిని 1921 లో స్థాపించారు. మొదట్లో ఇది రూట్‌లాండ్ యూనివర్సిటీగా ఉండేది. దాదాపు 18 వేల మంది విద్యార్థులు ఉన్నారు.

9) షెఫీల్డ్ యూనివర్సిటీ
(Sheffield University):
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో లీడ్ పొజిషన్‌లో ఉన్న వారిలో ఈ వర్సిటీ  2.3 శాతం మందితో తొమ్మిదో స్థానంలో ఉంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s